హైదరాబాద్‌లో మహా ఉద్యోగమేళా..ఆంధ్ర - తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త
- October 24, 2018
ట్రేడ్ హైదరాబాద్ డాట్ కామ్ ఆధ్వర్యంలో ఈ నెల 26,27,28 తేదీల్లో హైదరాబాద్‌లో మహా ఉద్యోగమేళా జరగనుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ జాబ్ మేళాలో 120కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి. ఇంధన, సౌర, మొబైల్, హాస్పిటాలిటీ, సివిల్, మెకానికల్, జ్యూవెలరీ, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, సహా ఇతర రంగాలకు చెందిన సంస్థలు 35 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
మహా ఉద్యోగ మేళా 2018 బ్రోచర్‌ను ట్రేడ్ హైదరాబాద్ డాట్ కామ్ కార్యాలయంలో బిజినెస్ అడ్వయిజరీ సర్వీసెస్ లిమిటెడ్ సీఈఓ కె. శ్రీరాం మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 5వ తరగతి విద్యార్హత మొదలు డిగ్రీ, సీఏ, సీఎస్, బీడీఎస్, ఎంబీబీఎస్ వరకు ఈ మేళాలో ఉద్యోగాలు పొందవచ్చునని అన్నారు.
ఒకవేళ తగిన విద్యార్హతలు లేకపోయినా టెక్నికల్, నాన్ టెక్నికల్లో ఇదివరకు అనుభవం ఉన్నవారు, పని సామర్థ్యం కలిగినవారు కూడా పాల్గొనవచ్చునని తెలిపారు. ఈ మహా జాబ్ మేళాను రికార్డ్ చేసేందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సంస్థ కూడా నగరానికి వస్తున్నట్టు తెలిపారు. మేళాలో పాల్గొనాలనుకునేవారు మరిన్ని వివరాల కోసం www.TradeHyd.com లేదా 6303659724 నెంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







