వైట్ హౌస్‌ని పేల్చేస్తారా ? పైప్ బాంబుల గుర్తింపు..ట్రంప్ హుంకరింపు
- October 25, 2018అమెరికాలో అత్యంత భద్రత కలిగిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో ఓ పైప్ బాంబ్ కంగొనడం సంచలనం సృష్టించింది.
అలాగే మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఇంకా హిల్లరీ, బిల్ క్లింటన్ నివాసాల్లోనూ ఇలాంటి గుర్తు తెలియని బాంబులు పార్సెల్‌లో రావడం అమెరికా ప్రముఖుల భద్రతపై మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని అధికారవర్గాలు భావిస్తున్నాయి.
ఓ పైప్ బాంబు న్యూయార్క్‌లోని టైం వార్నర్ సెంటర్‌కు కూడా అందింది. ఇది సీఐఏ మాజీ డైరెక్టర్ జాన్ బ్రెనన్ పేరిట అందిన పార్సెల్‌లో ఉంది. బిలియనీర్ అయిన జార్జ్ సోరో ఇంట్లోనూ ఇలాంటిదే 'దర్శనమిచ్చింది'. నల్లని ఎలక్ట్రికల్ టేపులో చుట్టి ఉన్న ఈ పైపుల నిండా గన్ పౌడర్ కూరి ఉంది. ఓ డిజిటల్ క్లాక్ టైమర్‌ను దీనికి అమర్చారు.
ఈ పైప్ బాంబుల వ్యవహారంపై సీరియస్ అయిన అధ్యక్షుడు ట్రంప్.. దీని వెనుక ఎవరున్నారో వెంటనే కనుక్కొంటామని, తమ భద్రత కన్నా అమెరికా ప్రజల భద్రత తమకు చాలా ముఖ్యమని అన్నారు. తాను హోం, ఎఫ్‌బీఐ, జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడానని, దర్యాప్తులో ఎలాంటి లోపం ఉండదని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా తయారు చేసిన పైప్ బాంబులను ఓ సీరియల్ బాంబర్ పంపినట్టు అనుమానిస్తున్నారు. వీటిని విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..