827 వెబ్‌సైట్లు బ్లాక్.. కేంద్రం ఆదేశం..

- October 25, 2018 , by Maagulf
827 వెబ్‌సైట్లు బ్లాక్.. కేంద్రం ఆదేశం..

మొత్తం 827 వెబ్‌సైట్లు బ్లాక్ అయ్యాయి. స్మార్ట్‌పోన్లు అందుబాటులోకి వచ్చాక మనుషుల మధ్య మాటలు తక్కువయ్యాయి. ఫోన్లలో మాటలు ఎక్కువయ్యాయి. ప్రపంచమంతా అర చేతిలో ఉందని ఓ పక్క సంతోషంగా ఉన్నా చిన్నా పెద్దా ఫోన్‌కి బానిసలవుతున్నారని బాధపడే పరిస్థితే ఎక్కువగా ఉంది. నలుగురు పిల్లలు చేరి ఫోన్‌ని చూస్తూ కూర్చున్నారంటే వారు ఫోన్లో ఏం చూస్తున్నారో అని పెద్దవాళ్లు భయపడుతున్న సందర్భాలు అనేకం. అర్థరాత్రి గదిలో లైట్లు వెలుగుతూనే ఉంటాయి. ఇంకా పడుకోలేదా అంటే ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నానంటూ అబద్ధాలు.

పిల్లల మాటలు, చేతలతో అమ్మా నాన్నలకి నిద్రపట్టని రాత్రులు. సినిమాలైతే పెద్దవారికి మాత్రమే అని మార్క్ చేసి వస్తాయి. మరి ఫోన్ల విషయానికి వస్తే.. అంతా ఓపెన్. ఇదే విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి 827 అశ్లీల సైట్లను బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ 827 వెబ్‌సైట్ల జాబితాను టెలికామ్ విభాగానికి అందజేసారు. నిలిపివేత తక్షణం అమలులోకి రావాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఇచ్చిన ఉత్తర్వుల్లో టెలికామ్ విభాగం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com