'వాయిస్ ఆఫ్ ఖలీఫా' పేరిట రేడియో స్టేషన్

- December 20, 2015 , by Maagulf
'వాయిస్ ఆఫ్ ఖలీఫా' పేరిట రేడియో స్టేషన్

ఆప్ఘనిస్తాన్ లోని ఇస్లామిక్ స్టేట్ అనుకూల ఉగ్రవాదులు సొంతంగా ఓ రేడియో స్టేషన్ ను ఏర్పాటు చేసుకొని యథేచ్ఛగా తమ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారు. రేడియో కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ.. యువతను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారు. ఈ విషయాన్ని ఆప్ఘనిస్తాన్ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఉగ్రవాదులు 'వాయిస్ ఆఫ్ ఖలీఫా' పేరిట రేడియో స్టేషన్ ను ఏర్పాటు చేసి స్థానిక 'పాష్తో' భాషలో తమ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు. జలాలాబాద్, ఇతర జిల్లాల్లో ఈ రేడియో ప్రసారాలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన పదజాలంతో ప్రసారాలు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు రేడియో స్టేషన్ కార్యకలాపాలు ఎక్కడి నుండి నిర్వహిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే రేడియో ప్రసారాలు ప్రజలకు చేరకుండా తగు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com