ఫేక్ న్యూస్ ప్రచారం: దయీష్ మిలిటెంట్‌కి 15 ఏళ్ళ జైలు
- October 25, 2018
అబుదాబీ ఫెడరల్ సుప్రీమ్ కోర్ట్, దయీష్కి చెందిన తీవ్రవాదికి 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష అనంతరం డిపోర్టేషన్ కూడా చేయనున్నారు. 45 ఏళ్ళ అరబ్ జాతీయుడు, దయీష్ మిలిటెంట్‌గా పనిచేస్తున్నాడు. యూఏఈ భద్రతకు నష్టం వాటిల్లేలా ఫేక్ న్యూస్‌ని, రూమర్స్‌ని ప్రచారం చేస్తున్నట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. అతని నుంచి పలు రకాలైన ఎలక్ట్రానిక్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇదిలా వుంటే మరో 27 ఏళ్ళ జీసీసీ పౌరుడికి మూడేళ్ళ జైలు శిక్ష, 500,000 దిర్హామ్‌ల జరీమానా విధించింది న్యాయస్థానం. ఇద్దరు ఎమిరేటీ జాతీయులకి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కౌన్సిలింగ్ సెంటర్‌కి పంపారు. వీరికి టెర్రిరిస్ట్ థ్రెట్ అభియోగాలున్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







