క్యాన్సర్‌పై పోరాటం: ఫండ్స్ కోసం వాకథాన్
- October 25, 2018
మస్కట్: 15వ వార్షిక వాకతాన్, మస్కట్‌లో అక్టోబర్ 30న జరగనుంది. 10 వేల మంది ఈ ఏడాది జరిగే వాకథాన్‌లో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్ (ఓసిఎ), ఈ వాకతాన్ని నిర్వహిస్తోంది. క్యాన్సర్‌పై పోరాటంలో భాగంగా విరాళాల్ని సేకరించేందుకు అలాగే క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్యాన్సర్ పేషెంట్స్, వారి బంధువులు, అలాగే క్యాన్సర్‌ని జయించినవారు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 15 ఏళ్ళ క్రితం తొలిసారిగా ఈ వాకథాన్ నిర్వహించినప్పుడు కేవలం 274 మంది మాత్రమే హాజరయ్యారని ఓసిఎ ప్రెసిడెంట్ డాక్టర్ వాహిద్ అల్ కురైసి చెప్పారు. 2017లో 8 వేల మంది పాల్గొనగా, ఈసారి 10 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. క్యాన్సర్ వాకథాన్‌లో పాల్గొనాలనుకునేవారికి రిజిస్ట్రేషన్ ఫీజు 3.5 ఒమన్ రియాల్స్. వారికి టి షర్ట్‌ని అలాగే ఓ రఫాలె టిక్కెట్‌ని అందజేస్తారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..