క్రిస్మస్ బరిలో ఉన్న అగ్ర హీరోలు
- October 26, 2018
పండగ వచ్చిందంటే చాలు.. మనవాళ్లు రిలీజ్ డేట్స్ ముందే రెడీ చేసుకుంటారు. మరీ పెద్ద హీరోలైతే కాస్త గ్యాప్ తీసుకుని వస్తారు. కానీ మీడియం రేంజ్ హీరోలైతే వరుసగా వచ్చేస్తారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ యేడాది ఫినిషింగ్ స్ట్రాంగ్ వార్ తో ముగియబోతోంది. అరవింద సమేత తర్వాత మళ్లీ ఏ పెద్ద స్టార్ సినిమా ఈ యేడాది లేనట్టే ఇక. అందువల్ల ఇక మీడియం రేంజ్ హీరోలు, సినిమాలదే హవా. అందుకు తగ్గట్టుగానే మనవాళ్లు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
దీపావళికి మనవాళ్ల నుంచి పెద్దగా సందడి కూడా లేదు. నవంబర్ 2న నాగచైతన్య సవ్యసాచి వస్తోంది. తర్వాత దీపావళి సందర్భంగా నిఖిల్ హీరోగా నటించిన ముద్ర విడుదలవుతోంది. 16న విజయ్ దేవరకొండ టాక్సీవాలా ఉంది. ఇక ఆ తర్వాత మళ్లీ ఆ స్తాయి సందడి మొదలయ్యేది డిసెంబర్ లోనే…
ఈ ఏడాది డిసెంబర్ లో సినిమాల మధ్య మంచి ఫైట్ జరగబోతుంది. అది కూడా క్రిస్మస్ సందర్భంగా ఒకే రోజు మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ మూడూ వేటికవే భిన్నమైన సినిమాలు కావడం విశేషం. డిసెంబర్ 14న రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ వస్తోంది. శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. హీరోయిన్ గా ఇలియానా మళ్ళీ ఈ చిత్రంతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ ముగ్గురికి ఈ సినిమా సక్సెస్ అవ్వడం చాలా అవసరం. ఒకవేళ అమర్ అక్బర్ ఆంటోని హిట్ అయితే, ఆ ప్రభావం క్రిస్మస్ వరకు ఉంటుందనడంలో సందేహం లేదు.
ఇక 21న వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతోన్న ‘యాత్ర’ విడుదలవుతోంది. మమ్మూట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీకి సంబంధించి ఇతర పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు అనే విషయం ఇప్పటి వరకూ ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ పై భారీ అంచనాలైతే ఉన్నాయి. కనీసం ఒక వర్గం ప్రేక్షకులైనా యాత్రను ఎంకరేజ్ చేస్తారనేది నిజం. మహి వి రాఘవ డైరెక్ట్ చేస్తోన్న యాత్ర నిజానికి సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. అనుకున్నదానికంటే ముందే పూర్తవుతుండటంతో ప్రీ పోన్ చేసుకని డిసెంబర్ 21న వేశారు.
డిసెంబర్ 21నే ఇక అదే రోజు డిఫరెంట్ మూవీస్ స్టార్ శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన ‘పడిపడిలేచెను మనసే’ విడుదలవుతోంది. హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీకి సంబంధించి రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. నేపాల్ లో వచ్చిన భూకంపం చుట్టూ అల్లుకున్న ప్రేమకథగా చెబుతున్నారు. ఇక శర్వా, సాయిపల్లవిల క్రేజ్ ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ తెస్తుందనుకోవచ్చు.
ఇక ఇదే రోజు వరుణ్ తేజ్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో వస్తోన్న అంతరిక్షం కూడా విడుదల కాబోతోంది. పూర్తిగా స్పేస్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీపై చాలా అంచనాలున్నాయి. దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఆల్రెడీ ఘాజీ వంటి మూవీతో దేశంమొత్తం ఆకట్టుకున్నాడు. అప్పుడు నీళ్లలో సినిమా ఇప్పుడు నింగిలో సినిమా. అదితిరావు హైదరి, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి. మొత్తంగా డిసెంబర్ లాస్ట్ వీక్ లో ఈ మూడు సినిమాల మధ్య పెద్ద యుద్ధమే జరగబోతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!