దుబాయ్‌ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌: షారుక్‌ మెసేజ్‌

- October 26, 2018 , by Maagulf
దుబాయ్‌ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌: షారుక్‌ మెసేజ్‌

దుబాయ్‌ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ ఈ రోజు నుంచి ప్రారంభమయ్యింది. దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌, దుబాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ షేక్‌ హమదాన్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ మెసేజ్‌తో దుబాయ్‌ మేల్కొంది. 'దుబాయ్‌ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌లో పాల్గొనాల్సిందిగా ఛాలెంజ్‌ చేస్తున్నా' అని ఆ మెసేజ్‌లో షేక్‌ హమదాన్‌ పిలుపునిచ్చారు. దుబాయ్‌ టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ఖాన్‌, షేక్‌ హమదాన్‌ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. ఇది అద్భుతమైన ఇనీషియేటివ్‌ అనీ, 30 రోజులపాటు రోజూ 30 నిమిషాల పాటు ఈ ఛాలెంజ్‌ని తానూ పాటిస్తాననీ, మీరు కూడా ఛాలెంజ్‌ స్వీకరించాలనీ షారుక్‌ పేర్కొన్నారు. 
  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com