త్వరలో రెడ్-ఐ విమానాలు..వీటిలో టికెట్ ధరలు బాగా తక్కువ

- October 27, 2018 , by Maagulf
త్వరలో రెడ్-ఐ విమానాలు..వీటిలో టికెట్ ధరలు బాగా తక్కువ

ముంబై: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా త్వరలో కొత్త తరహా విమాన సర్వీసులు ప్రారంభించనుంది. 'రెడ్- ఐ' అ నే పేరుతో ఈ విమానాలు తిరుగుతాయి. నవంబరు నెలాఖరు నుంచి ఈ కొత్త సర్వీసులు మొదలవుతా యి. సాధారణంగా ఈ తరహా విమానాలు రాత్రిపూట బయల్దేరి, తెల్లవారుజామున గమ్యస్థానాలకు చేరుకుంటాయి. వీటిలో టికెట్ ధరలు బాగా తక్కువగా ఉంటాయి. దాంతో ఇప్పటికే అవెురికా, యూరోపియన్ దేశాలలో ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి. ఢిల్లీ- గోవా-ఢిల్లీ, ఢిల్లీ-కోయంబత్తూరు-ఢిల్లీ, బెంగళూరు-అహ్మదాబాద్-బెంగళూరు మార్గాలలో నవంబరు 30 నుంచి ఈ రెడ్ ఐ విమానాలు నడుస్తాయని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఇవి ప్రతిరోజూ ఉంటాయి. ఎయిరిండియా విమానం ఏఐ883 ఢిల్లీలో రాత్రి 10 గంటలకు బయల్దేరి, 12.35 గంటలకు గోవా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏఐ884 విమానం గోవాలో అర్ధరాత్రి 1.15కు బయల్దేరి, తెల్లవారుజామున 3.40 గంటలకు ఢిల్లీ వస్తుంది. అలాగే కోయంబత్తూరు వెళ్లడానికి ఏఐ547 విమానం రాతి 9.15కు బయల్దేరి, కోయంబత్తూరుకు 12.30కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కోయంబత్తూరులో ఏఐ548 విమానం రాత్రి 1గంటకు బయల్దేరి తెల్లవారుజామున 4 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది.బెంగళూరు నుంచి అహ్మదాబాద్ వెళ్లే ఏఐ589 విమానం బెంగళూరులో రాత్రి 12.30కు బయల్దేరి, 2.35కి అహ్మదాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో తెల్లవారుజామున 3.05 గంటలకు బయల్దేరి, బెంగళూరులో 5.25 గంటలకు ల్యాండ్ అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com