సారీ మోడీ..రాలేను - ట్రంప్

- October 28, 2018 , by Maagulf
సారీ మోడీ..రాలేను - ట్రంప్

వాషింగ్టన్: వచ్చే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలంటూ ఇండియా పంపిన ఆహ్వానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా అధికారులు ఇప్పటికే ఎన్‌ఎస్‌ఏ అజిత్ ధోవల్‌కు చేరవేసినట్లు సమాచారం. ఆ సమయంలో అమెరికాలోనే కొన్ని ముఖ్యమైన పనులు ఉన్న కారణంగా ట్రంప్ రాలేకపోతున్నారని అమెరికా అధికారులు వివరించారు. స్టేట్ ఆఫ్ ద యూనియన్ ప్రసంగంతోపాటు, ఇతక కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో ట్రంప్ పాల్గొనాల్సి ఉంది. ఆహ్వానాన్ని మన్నించలేకపోతున్నందుకు చింతిస్తున్నానని ట్రంప్ అన్నారు. వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే గణతంత్ర వేడుకలకు రావాల్సిందిగా ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ట్రంప్‌కు ఇండియా అధికారిక ఆహ్వానం పంపించింది.

అప్పుడే తమకు ఆహ్వానం అందినట్లు తెలిపిన అమెరికా.. దీనిపై సెప్టెంబర్‌లో రెండు దేశాల మధ్య జరగబోయే 2+2 సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. అయితే ఈ మధ్య కాలంలో ఇరాన్ ఆయిల్, రష్యాతో రక్షణ ఒప్పందాల నేపథ్యంలో ఇండియా, అమెరికా మధ్య సంబంధాలు దెబ్బ తిన్న విషయం తెలిసిందే. రష్యా నుంచి ఇండియా ఎస్-400 మిస్సైల్ వ్యవస్థను కొనుగోలు చేయడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇండియా ఆహ్వానాన్ని తిరస్కరించడం చర్చనీయాంశమైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com