ఇండోనేసియాలో కూలిన విమానం, విమానంలో 188 మంది...
- October 28, 2018
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 188 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న లయన్ ఎయిర్ విమానం సముద్రంలో కుప్పకూలింది. జకార్తా విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొద్ది క్షణాలకే ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఉదయం 6.20 గంటలకు జకార్తా విమానాశ్రయం నుంచి 181 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బందితో లయన్ ఎయిర్ విమానం సుమత్ర దీవుల్లోని పంగ్కల్ పినాంగ్‌కు బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన 13 నిమిషాలకే అంటే 6.33 గంటలకు విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో సంబంధాలు తెగిపోయాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. అదృశ్యమైన విమానం కాసేపటికే జావా సముద్రంలో కుప్పకూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. సముద్ర తీరానికి కొద్ది దూరంలోనే ఈ విమానం కూలిపోయినట్లు తెలుస్తోంది.
శకలాల గుర్తింపు..
ఈ ఘటనపై తక్షణమే స్పందించిన అధికారులు విమానం కోసం గాలింపు చేపట్టారు. తీరానికి సమీపంలో విమాన శకలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 'విమానంలో ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది అనేది మేం ఇప్పుడే చెప్పలేం. కానీ సాధ్యమైనంతవరకు ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేస్తాం' అని అధికారులు చెబుతున్నారు. నిజానికైతే 6.20 గంటలకు బయల్దేరిన ఈ విమానం.. 7.20 గంటలకే గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంది. అయితే ఇంతలోనే ఈ ఘోరం సంభవించింది. ప్రయాణికుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించారు. విమాన శకలాల వద్దకు సహాయ బృందాలు చేరుకున్న దృశ్యాలను ఓ నేవీ అధికారి తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు