యూఏఈ తొలి శాటిలైట్‌ నింగిలోకి..!

- October 28, 2018 , by Maagulf
యూఏఈ తొలి శాటిలైట్‌ నింగిలోకి..!

యూఏఈ:చారిత్రక ఘట్టానికి సర్వం సిద్ధమయ్యింది. జపాన్‌లోని తనెగాషిమా దీవి నుంచి యూఏఈ తొలి శాటిలైట్‌ 'ఖలీఫా శాట్‌'ని నింగిలోకి పంపుతున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని అందరూ వీక్షించేందుకోసం లైవ్‌ స్ట్రీమింగ్‌ ఏర్పాటు చేశారు. యూఏఈ టైమింగ్‌ ఉదయం 8 గంటల నుంచి ఇది ప్రత్యక్ష ప్రసారం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించబోతున్నారు. ఖలీఫా శాట్‌ని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఎర్త్‌ అబ్జర్వింగ్‌ శాటిలైట్‌గా అభివర్ణిస్తున్న సంగతి తెల్సిందే. మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ స్పేస్‌ సెంటర్‌ (ఎంబిఆర్‌ఎస్‌సి) ఈ లైవ్‌ స్ట్రీమింగ్‌కి ఏర్పాట్లు చేసింది. ఖలీపా శాటిలైట్‌, హై క్వాలిటీ ఇమేజెస్‌ని అందించనుంది. సుమారు 70 మంది శాస్త్రవేత్తలు ఈ శాటిలైట్‌ తయారీలో కీలక భూమిక పోషించారు. వీరిలో 10 మంది జపాన్‌కి వెళ్ళి అక్కడినుంచి శాటిలైట్‌ లాంచ్‌ని పర్యవేక్షిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com