యూఏఈ స్కూల్ ప్రిన్సిపాల్ అరెస్ట్
- October 28, 2018
షార్జా:షార్జా పోలీసులు, ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్‌ని అరెస్ట్ చేశారు. ఇద్దరు విద్యార్థులకు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లను నిరాకరించడమే ప్రిన్స్‌పాల్ అరెస్ట్‌కి కారణమని పోలీసులు తెలిపారు. 24 గంటల్లో పేరెంట్స్‌కి స్టూడెంట్స్ తాలూకు డాక్యుమెంట్స్‌ని అందించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా, ప్రిన్సిపాల్ ఆ ఆదేశాల్ని లెక్కచేయకపోవడంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ప్రిన్సిపాల్ తీరు కారణంగా విద్యార్థులు రెండు నెలలపాటు స్కూల్‌కి వెళ్ళేందుకు వీల్లేని పరిస్థితి ఏర్పడింది. తొలుత విద్యార్థి తండ్రి, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌ని ఆశ్రయించారు. ఆ తర్వాత న్యాయస్థానానికి వెళ్ళారు. ప్రిన్సిపాల్‌ని ఎంతలా బతిమాలినా స్పందించకపోవడంతోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని బాధిత చిన్నారుల తండ్రి చెప్పారు. సెప్టెంబర్ 9న న్యాయస్థానం, విద్యార్థులకు ఫైల్స్ అప్పగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే 950 దిర్హామ్‌ల కోర్టు ఫీజునూ తండ్రికి చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే ప్రిన్సిపాల్ లెక్క చేయలేదు. మరోమారు బాధిత తండ్రి కోర్టును ఆశ్రయించగా, పోలీసులు రంగంలోకి దిగి చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..