బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జాయర్ బోసానారు
- October 29, 2018
సంప్రదాయ ఫాసిస్ట్ నాయకుడు జాయర్ బోసా నారు(63) బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్ట్ కూటమికి చెందిన వర్కర్స్ పార్టీ నాయకుడు ఫెర్నాండో హాడడ్పై ఆయన సంపూర్ణ మెజారిటీ సాధించారు. బోసానారుకు 55.2 శాతం ఓట్లు రాగా, ఫెర్నాండోకు 44.8 శాతం ఓట్లు దక్కాయి. గతంలో సైనికాధికారిగా పనిచేసిన బోసానారు ఎన్నికల ప్రచార సమయంలో తరచూ మహిళలు, గేలపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచి ‘బ్రెజిల్ ట్రంప్’గా పేరొందారు. గత నాలుగు సార్లు లెఫ్ట్ పార్టీకి పట్టంకట్టిన బ్రెజిల్ ప్రజలు..మార్పు కోసం ఈసారి బోసానారుకు అధికారం అప్పగించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. బోసానారు గెలుపుపై మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజ్యాంగం, వైవిధ్యం, భిన్నత్వం పరిరక్షించి ప్రజలను ఏకంచేస్తానని ఆయన తన తొలి సందేశంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..