ఇస్తాంబుల్‌ లో కొత్త ఎయిర్‌పోర్టు ను ప్రారంభించిన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌

- October 29, 2018 , by Maagulf
ఇస్తాంబుల్‌ లో కొత్త ఎయిర్‌పోర్టు ను ప్రారంభించిన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌

టర్కీలోని ఇస్తాంబుల్‌ నగరంలో కొత్త ఎయిర్‌పోర్టు ప్రారంభమైంది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ ఈ విమానాశ్రయాన్ని సోమవారం ప్రారంభించారు. త్వరలో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం అవుతుందని పేర్కొన్నారు. బ్లాక్‌ సీ తీరంలో ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్టును నిర్మించారు. ఏటా 9 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని అంచనా. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఆ సంఖ్య 20 కోట్లకు చేర వచ్చునని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 19,000 ఎకరాల్లో ఆరు రన్‌వేలతో అట్లాంటాలోని హార్ట్స్‌ఫీల్డ్‌-జాక్సన్‌ రికార్డులు బ్రేక్‌ చేస్తుందని భావి స్తున్నారు. ఎయిర్‌పోర్టు ఇంటీరియర్‌ టర్కిష్‌, ఇస్లామిక్‌ డిజైన్ల కలయికతో ఉంటుంది. తులీప్‌ షేప్‌లో ఉన్న ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ టవర్‌కు 2016లో ఇంటర్నేషనల్‌ ఆర్కిటెక్చర్‌ అవార్డ్‌ లభిం చింది. ప్రయాణికులకు మొబైల్‌ అప్లికేషన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో అందిస్తున్న సేవలు హైటెక్‌ సెక్యూరిటీ సిస్టమ్‌తో ఉన్నాయి. ఈ కొత్త ఎయిర్‌పోర్టు సేవలు డిసెంబర్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత ఇస్తాంబుల్‌లోని అటాటుర్క్‌ ఎయిర్‌పోర్ట్‌ని ముసేసి వాణిజ్య అవసరాల కోసం ఉపయోగిస్తారు. ఇక్కడి నుంచి మూడు డొమెస్టిక్‌ డెస్టినేషన్ల(అంకారా, అంతాల్య, ఇజ్మిర్‌)కు టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలను నడపనుంది. ఉత్తర సిప్రస్‌లోని ఎర్కాన్‌, బాకుల మధ్య రాకపోకలు సాగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com