చన్నీటితో స్నానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.!
- October 29, 2018
చల్లని నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నీటితో స్నానం చేస్తే బరువు తగ్గుతారని చాలామంది నమ్ముతుంటారు. అది నిజమా.. లేదా అబద్దమా.. అని తెలుసుకుందాం.. నిజమే.. ఎలా అంటే.. ప్రతిరోజూ చన్నీటితో స్నానం చేస్తే నెలరోజుల్లో అధిక బరువు తగ్గుతారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా చల్లని నీటితో స్నానం చేస్తే జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని కొందరి మాట.. కానీ, అది నిజం కాదు.. చల్లని నీటితో స్నానం చేస్తేనే జలుబు, దగ్గు రావు. ఎందుకంటే చల్లటి నీటిని స్నానం చేస్తే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఈ నీరు శరీరానికి తగిలినప్పుడు అది రక్తప్రసరణ పెంచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో అనారోగ్యాలతో పోరాడే తెల్ల రక్తకణాలు సంఖ్యను పెంచుతాయి. అలసట, ఒత్తిడిగా ఉన్నప్పుడు చల్లని నీటితో స్నానం చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చన్నీటి స్నానం ఎంతో మంచిది. కొందరు అనుకునే మాటేంటంటే.. చలికాలం వచ్చేసింది.. ఈ చలిలో చన్నీటితో ఎలా స్నానం చేయాలి.. దేవుడా అంటూ తికమకపడుతుంటారు. చన్నీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. మీకే ఆ నీటితో స్నానం చేయాలనిపిస్తుంది. ఎనర్జీని పెంచుతుంది. చర్మసంరక్షణకు చన్నీటి స్నానం ఎంతో ఉపకరిస్తుంది.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!









