నవంబర్ 14 న పట్టాల కెక్కనున్న రామాయణ ఏక్స్ ప్రెస్.!
- October 29, 2018
ఇండియన్ రైల్వేస్ నూతన అధ్యాయానికి నాంది పలికింది ..భారతదేశ చరిత్రలో మొదటిసారి పుణ్యక్షేత్రాలను కలుపుతూ పిలిగ్రిమ్ ట్రైన్ ను ప్రారంభించనుంది. దీని పేరే " రామాయణ ఏక్స్ ప్రెస్" .. ఇది ప్రధానంగా " రామాయణ సర్క్యూట్ " అనగా అయోధ్య నుండి శ్రీలంక వరకు శ్రీరాముల వారికి సంబందించిన అన్ని ప్రదేశాలనూ కలుపుతూ మొదటిసారి పిలిగ్రిమ్ ట్రైన్ ను ప్రారంభించనుంది.
నవంబరు 14 నుండి పట్టాల కెక్కనున్న ఈ రామాయణ ఏక్స్ ప్రెస్ , ముందుగా డిల్లీ నుండి ప్రారంభమై ఆయొధ్య, నందిగ్రాం, జనకపూర్, సీతామర్రి, ప్రయాగ, వారణాసి, చిత్రకూట్, శ్రింగవేరపుర్, నాసిక్, హంపి ల మీదగా రామేశ్వరం చేరుతుంది .. మరలా అక్కడి నుండి భక్తులను, విమానాల ద్వారా శ్రీలంకకు తీసుకువెళతారు. ఈ పర్యటనమెత్తం, రైల్వే అధికారులే దగ్గరుండి, ప్రయాణికులకు అన్నీ క్షేత్రాలను చూపిస్థారు. రైల్వే స్టేషన్ల నుండి బస్సుల ద్వారా, ఆయా పవిత్ర క్షేత్రాలకు తీసుకువెళ్ళి దైవదర్శనం, చారిత్రాత్మక కట్టడాలను, గురుతులను దగ్గరుండి చూపిస్థారు. అంతేకాకుండా ఈ క్షేత్రాలలొని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలొ రాత్రి పూట బసచేసే అవకాశం కల్పిస్థారు.
శ్రీలంకలొని సీతమ్మవారు ఉన్న అశొకవనం ప్రదేశాలను, రాయాయణ యుద్ధం జరిగిన ప్రదేశాలను, అత్యంత ప్రసిద్ధి చెందిన మునేశ్వరం దేవాలయం, రంబొడా, చిలావ్ లను చూపించి, తిరిగి విమానంలొ మన దేశానికి తీసుకు వస్థారు. 16 రొజులపాటు జరిగే ఈ ప్రయాణంలొ, ఒక్కొక్క ట్రైన్ కు 800 మందికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క ప్రయాణికునిడి టిక్కెట్టు వెల 15,120/- భారతదేశంలొ మొదటిసారి ప్రారంభించనున్న రామాయణ ఏక్స్ ప్రెస్ ను నవంబరు 14 న భారత ప్రధాని నరేంద్ర మోది ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







