సూర్య తండ్రిపై నెటిజన్స్ ఆగ్రహం

- October 30, 2018 , by Maagulf
సూర్య తండ్రిపై నెటిజన్స్ ఆగ్రహం

తమిళ హీరో సూర్య తండ్రి శివకూమర్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ‌ధురైలోని షోరూం ప్రారంభోత్స‌వానికి ముఖ్య అతిధిగా శివ‌కుమార్‌ వెళ్లారు. అక్కడ ఓ అభిమాని పట్ల ఆయన ప్రవర్తించిన  తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శివకూమర్‌తో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించిన ఓ అభిమాని ఫోన్‌ను చేతితో పక్కకు నేట్టివేశాడు. ఈ దృశ్యం కెమెరాలో రికార్డు అయింది, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్స్ శివకూమార్‌పై మండిపడుతున్నారు. ఎప్పుడూ ప్ర‌శాంతంగా క‌నిపించే శివకూమార్‌ ఇలా చేయడం సరికాదు. వెంటనే క్ష‌మాప‌ణ చెప్పితీరాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com