2,600 కిలోలకు పైగా తేనె స్వాధీనం
- October 30, 2018
మస్కట్:2,670 కిలోల తేనె (హనీ)ను మస్కట్ మునిసిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తేనె తయారు చేస్తున్న, విక్రయిస్తున్న కేంద్రాలపై జరిపిన దాడుల్లో ఈ తేనె బయట పడింది. రువిలోని ఓ ఇంటిలో దీన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 30 కిలోల బరువు తూగే 89 కంటెయినర్స్తోపాటు, 134 బాటిల్స్‌ని ఈ సందర్భంగా అధికారులు సీజ్ చేయడం జరిగింది. రాయల్ ఒమన్ పోలీస్తో కలిసి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గ్రేటర్ ముట్రా, రువిలోని ఓ ఇంటిపై దాడి చేసి అక్రమంగా తయారు చేస్తున్న హనీని స్వాధీనం చేసుకున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా పలువుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







