యూఏఈ ఆమ్నెస్టీ డిసెంబర్ 1 వరకు పొడిగింపు
- October 30, 2018
యూఏఈ:ఆమ్నెస్టీ పీరియడ్‌ని యూఏఈ ప్రభుత్వం నెల రోజులపాటు పొడిగిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆగస్ట్ 1న ప్రారంభమైన అమ్నెస్టీ వాస్తవానికి అక్టోబర్ 31వ తేదీతో ముగియాల్సి వుంది. నెల రోజుల పొడిగింపుతో డిసెంబర్ 1 వరకు అమ్నెస్టీ పొందే వీలుంది. యూఏఈ వ్యాప్తంగా అమ్నెస్టీ కోసం 9 సెంటర్స్‌ని ఏర్పాటు చేయడం, ఈ సెంటర్స్‌కి పెద్దయెత్తున లబ్దిదారులు వెళుతుండడం తెలిసిన సంగతులే. దేశం విడిచి వెళ్ళాలనుకునేవారికి, అలాగే తమ రెసిడెన్సీ వీసాల్ని కరెక్ట్ చేసుకోవడానికీ ఈ అమ్నెస్టీ పీరియడ్ వలసదారులకు ఎంతో ఉపయోగపడ్తుంది. చిన్న చిన్న ఉల్లంఘనలతో 'ఇల్లీగల్' ముద్ర పడ్డ వలసదారులు, అమ్నెస్టీతో 'లీగల్'గా మారే అవకావం కల్పిస్తోంది యూఏఈ ప్రభుత్వం. అబుదాబీలో షాహామా, అల్ అయిన్, అల్ ఘర్బియాలోనూ, దుబాయ్‌లో అల్ అవీర్‌లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ అమ్నెస్టీ కేంద్రాలున్నాయి. షార్జా, అజ్మన్, రస్ అల్ ఖైమా, ఫుజారియా, ఉమ్ అల్ కువైన్‌లో రిసెప్షన్ సెంటర్స్‌ని కూడా అందుబాటులోకి తెచ్చారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..