ఎ.పి. ఫిలిం ఛాంబర్ ఆఫ్‌ కామర్స్ బాధ్యలందుకున్నది వీరే

- October 30, 2018 , by Maagulf
ఎ.పి. ఫిలిం ఛాంబర్ ఆఫ్‌ కామర్స్ బాధ్యలందుకున్నది వీరే

ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ద్వితీయ వార్షిక సర్వసభ్య సమావేశం మంగళగిరి మండలం ఆత్మకూరులోని హ్యాపీ రిసార్ట్స్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో వాణిజ్య మండలి నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి కె.సురేష్‌బాబు ప్రకటించారు. అధ్యక్షుడిగా అంబటి మధుమోహన్‌కృష్ణ, ఉపాధ్యక్షులుగా పీవీఎస్.వర్మ(విజయవర్మ), బి.వెంకటేశ్వరరావు, ఎ.జయప్రకాశ్.., ప్రధాన కార్యదర్శిగా జేవీ. మోహన్‌గౌడ్‌, సంయుక్త కార్యదర్శులుగా ఎం.శ్రీనాథ్‌రావు, సుబ్బారావు కనగాల, జె.శ్రీనివాసరావు, కోశాధికారిగా పాలెపు రామారావు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా మధుమోహన్‌కృష్ణ మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు చేపడతామని తెలిపారు. తనను ఎ.పి. ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం పట్ల విజయ్ వర్మ పాకలపాటి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com