ముద్దు గొడవ: స్కూల్ నుంచి విద్యార్థి బహిష్కరణ
- October 30, 2018
దుబాయ్‌లోని ఓ స్కూల్లో విద్యార్థి అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతన్ని స్కూల్ నుంచి బహిష్కరించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థి, సహ విద్యార్థిని ముద్దాడుతూ దాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, ఇందుకు కారకుడైన విద్యార్థిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. విచారణ జరిపిన అనంతరం మినిస్ట్రీ, ఆ బాలుడ్ని స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసేలా ఆదేశాలు జారీ చేసింది. లెవల్ ఫోర్ ఉల్లంఘనగా దీన్ని నమోదు చేశారు. సెక్సువల్ అబ్యూస్ సహా పది ముఖ్యమైన నిబంధనల ఉల్లంఘనల్లో దేనికి పాల్పడినా స్కూల్ నుంచి విద్యార్థిపై కఠిన చర్యలుంటాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







