క్యాన్సర్‌ వాకథాన్‌లో ఇండియన్‌ అంబాసిడర్‌

- October 30, 2018 , by Maagulf
క్యాన్సర్‌ వాకథాన్‌లో ఇండియన్‌ అంబాసిడర్‌

మస్కట్‌: 8000 మందికి పైగా పౌరులు, రెసిడెంట్స్‌ యాన్యువల్‌ క్యాన్సర్‌ వాక్‌లో పాల్గొన్నారు. ఒమన్‌ క్యాన్సర్‌ అసోసియేషన్‌, క్యాన్సర్‌ పట్ల అవగాహన పెంచే క్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. వరుసగా 15వ ఏడాది ఈ కార్యక్రమం నిర్వహించబడింది. కుర్రుమ్‌ నేషనల్‌ పార్క్‌ వద్ద అక్టోబర్‌ 30న జరిగిన ఈ కార్యక్రమంలో భారత అంబాసిడర్‌ సహా పలువురు ప్రముఖులు పాల్గొని, క్యాన్సర్‌ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాకథాన్‌లో 8,500 మంది వరకూ పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. భారత రాయబారి మును మహావర్‌, ఎంబసీకి చెందిన పలువురు అధికారులతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒమన్‌ క్యాన్సర్‌ అసోసియేషన్‌ నిర్వహించిన పింక్‌ రిబ్బన్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌, మస్కట్‌లోని పలు ప్రాంతాల్లోనూ జరిగింది. మాల్స్‌కి వచ్చే విజిటర్స్‌కి క్యాన్సర్‌ పట్ల అవగాహన కలిగేలా పలు కార్యక్రమాలు చేపట్టారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com