పాక్ లో క్రైస్తవ మహిళకు మరణశిక్ష నుంచి విముక్తి
- October 31, 2018
పాకిస్థాన్లో క్రైస్తవ మహిళ ఆసియా బీబీ మరణశిక్ష నుంచి విముక్తి పొందింది. దైవ దూషణకు పాల్పడిన కేసులో .. గతంలో లాహోర్ కోర్టు ఆమెకు మరణశిక్షను ఖరారు చేసింది. అయితే ఇవాళ పాకిస్థాన్ సుప్రీంకోర్టు.. ఆసియా బీబీ అభ్యర్థనను స్వీకరించింది. ఆమెకు ఈ కేసులో ప్రాణ విముక్తి కల్పిస్తున్నట్లు సీజేపీ తెలిపారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్థాన్ మియాన్ సాకిబ్ నిసార్తో పాటు జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా, జస్టిస్ మజ్హర్ ఆలమ్ ఖాన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. దైవాన్ని దూషించిన ఘటనలో 2009లో ఆసియా బీబీపై కేసు నమోదు అయ్యింది. ఓ ట్రయల్ కోర్టు 2010 నవంబర్లో ఆమెకు మరణశిక్షను ఖరారు చేసింది. ఆ తీర్పును లాహోర్ హైకోర్టు సమర్థించింది. అయితే ఆ రెండు తీర్పులను రద్దు చేస్తున్నట్లు ఇవాళ సీజేపీ తెలిపారు. ఆసియా బీబీని తక్షణమే రిలీజ్ చేయాలని ఆయన తన తీర్పులో ఆదేశించారు. మొత్తం 56 పేజీల తీర్పును తయారు చేశారు. ఈ కేసులో ఆసియా ఇప్పటికే 8 ఏళ్ల జైలు శిక్షను అనుభవించింది. మహ్మద్ ప్రవక్తను అవమానించినట్లు ఆసియాపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!