బహ్రెయిన్ ప్రతిపక్ష నేతకు జీవిత ఖైదు..

- November 04, 2018 , by Maagulf
బహ్రెయిన్ ప్రతిపక్ష నేతకు జీవిత ఖైదు..

బహ్రెయిన్:బహ్రెయిన్ ప్రతిపక్ష నేత షేక్ అలీ సల్మాన్‌కు ఆ దేశ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఖతార్ దేశానికి గూఢచారిగా పని చేశారనే కేసులో అపీల్ కోర్టు ఆయనను దోషిగా నిర్థారించింది.
ప్రత్యర్థి దేశమైన ఖతార్‌తో సల్మాన్ కుమ్మక్కయ్యారనే ఆరోపణలకు సంబంధించిన కేసులో బహ్రెయిన్ హైకోర్టులోని తొలి దశ న్యాయస్థానం ఆయనను నిర్దోషిగా ప్రకటించిన కొన్ని నెలలకే ఉన్నత న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.
ఖతార్‌తో బహ్రెయిన్ 2017 నుంచి సంబంధాలను పూర్తిగా తెంచేసుకుంది.
ఇది న్యాయాన్ని అపహాస్యం చేసే నిర్ణయమని అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆమ్నెస్టీ వ్యాఖ్యానించింది. అసమ్మతిని అణచివేసే ధోరణితో వ్యవహరిస్తున్న బహ్రెయిన్ వైఖరికి ఇదొక తాజా ఉదాహరణ అని ఆరోపించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com