బీచ్‌ గోయర్స్‌కి ఎన్‌సిఎం వెదర్‌ అలర్ట్‌

- November 04, 2018 , by Maagulf
బీచ్‌ గోయర్స్‌కి ఎన్‌సిఎం వెదర్‌ అలర్ట్‌


యూ.ఏ.ఈ:నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ, బీచ్‌ గోయర్స్‌కి 'రఫ్‌ సీ' అలర్ట్‌ ప్రకటించింది. వెదర్‌ రిపోర్ట్‌లో భాగంగా, ఎన్‌సిఎం ఈ హెచ్చరికల్ని జారీ చేసింది. అరేబియన్‌ గల్ఫ్‌ రఫ్‌గా వుంటుందనీ, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయనీ, బీచ్‌ గోయర్స్‌ చాలా అప్రమత్తంగా వుండాలని స్పష్టం చేసింది ఎన్‌సిఎం. కెరటాలు 6 అడుగుల ఎత్తున ఎగసిపడే ప్రమాదం వుందని 'హెచ్చరికలో' ఎన్‌సిఎం పేర్కొంది. మరోపక్క, యూఏఈలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై వుంటుందని వెదర్‌ రిసోర్ట్‌ చెబుతోంది. సాధారణ నుంచి ఓ మోస్తరుగా గాలులు వీచే అవకాశం వుంది. మినిమమ్‌ టెంపరేచర్స్‌ 12.4 డిగ్రీల సెంటీగ్రేడ్‌కి పడిపోయింది. గాలుల తీవ్రత కారణంగా డస్ట్‌ బ్లో అవుతుందనీ, తద్వారా విజిబిలిటీ సమస్య వాహనదారుల్ని వెంటాడనుందనీ ఎన్‌సిఎం తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com