ఇటలీలో భీకర తుఫాన్
- November 04, 2018
మిలాన్/రోమ్: ఇటలీలో సంభవించిన భీకర తుఫాన్ వల్ల భారీగా వర్షాలు కురిసి వరద పెరుగడంతో 17 మంది మరణించారు. దాదాపు 1.4 కోట్ల చెట్లు నేలమట్టమయ్యాయి. ఈదురుగాలులు గంటకు 180 కి.మీ. వేగంతో వీస్తున్నాయి. చెట్లు విరిగి మీద పడటంతోనే ఎక్కువ మంది మరణించారు. సిసిలీ, ట్రెన్టినో, వెనిటో రాష్ర్టాలను తుఫాన్ కుదిపేసింది. భారీగా కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు స్తంభించాయి. అధికారులు మాట్లాడుతూ తుఫాన్ ధాటికి భారీగా విధ్వంసం జరిగిందని, తిరిగి కోలుకోవడానికి దాదాపు 100 ఏండ్లు పట్టవచ్చని చెప్పారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ఉన్నారని తెలిపారు. వరద పెరుగడంతో పాఠశాలలను మూసివేశామని పేర్కొన్నారు. తుఫాన్ ప్రధానంగా ఇటలీ ఉత్తర ప్రాంతం, వెనిస్ చుట్టుపక్కల ప్రభావం చూపిందని, దీంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







