అంబానీ కూతురు ఈషా ‘వెడ్డింగ్ కార్డ్’ అదరహో..
- November 05, 2018
భారత్ దేశంలోనే అపర కుబేరుడు…రిలయన్స్ ఇండస్ట్రీ సంస్థలకు రారాజు. అలాంటి ముఖేష్ అంబానీ ముద్దుల కూతురు పెళ్లంటే మమూలు విషయమా? పెళ్లికోసం ఆకాశమంత పందిరి ఉండాల్సిందే. అందు కోసం అన్ని ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే పెళ్లి వేడుక ఉండడంతో…ముఖేష్ కూతురి పెళ్లి వేడుక కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా అత్యంత ఖర్చుతో కూడుకున్న వెడ్డింగ్ కార్డును అంబానీ కుటుంబం రిలీజ్ చేసింది.
మామూలుగా పెళ్లి కార్డును కార్డు రూపంలో తయారు చేసి బంధు మిత్రులకు ఇస్తాం. కానీ ముఖేష్ అంబాని గారాల పట్టి పెళ్లి కార్డు కోసం ఏకంగా ఓ పెట్టెనే రూపొందించారు. బంగారం పూతతో కూడిన పెట్టె ఓపెన్ చేసి చూస్తే లక్ష్మీదేవి చిత్రపటంతో రూపొందించిన పెళ్లికార్డు దర్శనమిస్తుంది. కలర్‌ఫుల్‌గా రూపొందించిన ఈ పెళ్లి కార్డు ఆకట్టుకుంటోంది.
అత్యంత రాయల్ లుక్‌తో రూపొందించిన ఈ వెడ్డింగ్ కార్డు ఖరీదు విలువ ఒక్కొక్కటీ 50 వేల రూపాయలపైనే ఉంటుందని సమాచారం. వివిధ రంగాల్లోని ప్రముఖులు అందరికి ఈ కార్డును అందజేసి పెళ్లికి ఆహ్వానించనున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన వెడ్డింగ్ కార్డుల్లో ఇదే అంత్యంత రిచ్‌గా, అట్రాక్టివ్‌గా కనిపిస్తోంది.
ఇప్పటికే ఈషా అంబానీ పెళ్లికి ముహూర్తం ఖరారైంది. డిసెంబరు 12న ఆమె పెళ్లి పిరమాల్ గ్రూప్ అధినేత అజయ్ పిరమాల్ కుమారుడు ఆనంద్ పిరమాల్‌తో అంగరంగ వైభవంగా జరగబోతోంది. పెళ్లి వేడుక ఎక్కడ నిర్వహిస్తారనే విషయంపై ఊహాగానాలు వస్తున్న సమయంలో, ముంబయిలోని ముకేశ్ అంబానీ స్వగృహంలోనే ఈ వేడుక ఉండబోతోందని ఇరు కుటుంబ వర్గాలు ధ్రువీకరించాయి. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో.. భారతీయ సంస్కృతి, సంప్రదాయ పద్దతిలో అంబానీ స్వగృహంలో ఈ వేడుక జరగనుంది. వివాహ వేడుకకు ముందు వారాంతంలో అంబానీ, పిరమాల్ కుటుంబాలు, వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఉదయ్‌పూర్‌లో ఘనంగా విందు ఏర్పాటు చేయబోతున్నారు.
గత సెప్టెంబర్ నెలలోనే ఇషా అంబానీ నిశ్చితార్థం అజయ్ పిరమాల్ తనయుడు ఆనంద్ పిరమాల్‌తో వైభవంగా జరిగింది. ఇందుకు ఇటలీలోని లేక్ కోమో వేదికైంది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులతో పాటు దేశ విదేశాల నుండి ముఖ్యమైన వ్యక్తులు ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. ఇటలీ నది తీరంలో ఎంగేజ్‌మెంట్ వేడుక కళ్లు జిగేల్ మనేలా జరిగింది.
ఈషా, ఆనంద్ చాలాకాలంగా స్నేహితులు. అంబానీ, పిరమల్ కుటుంబాల మధ్య నాలుగు దశాబ్దాలుగా మంచి స్నేహం ఉంది. ఆనంద్ పిరమల్ ఇటీవలే మహాబలేశ్వర్‌లో ఒక గుడి దగ్గర ఈషాకు ప్రపోజ్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!