దుబాయ్ పోలీస్ - ఫ్లయింగ్ మోటర్ సైకిల్ వినియోగం
- November 08, 2018దుబాయ్:2020 నాటికి దుబాయ్ పోలీసులకు ఫ్లయింగ్ మోటార్‌సైకిల్ అందుబాటులోకి రానుంది. ఓ వీడియోలో ఈ ఫ్లయింగ్ మోటార్‌సైకిల్ గురించిన వివరాల్ని తెలిపారు. అధికారులు దీనికి సంబంధించి పూర్తి ట్రెయినింగ్ తీసుకుని, సార్కిపయన్3 హోవర్ బైక్‌ని వినియోగిస్తున్నట్లు వీడియోలో కన్పిస్తోంది. బైక్‌ని కంట్రోల్ చేయడానికి సంబంధించి సునిశిత శిక్షణ అవసరం. శిక్షణ అనంతరం బైక్‌ని అధికారులు వినియోగిస్తున్నారు. గాల్లోకి వెళ్ళడం, తిరిగి సేఫ్‌గా ల్యాండ్ అవడం అతి ముఖ్యమైన అంశాలు. దుబాయ్ పోలీస్ - డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఖాలిద్ అల్ రజ్సౌకి మాట్లాడుతూ, ఈ బైక్ రాకతో పోలీసు వ్యవస్థ సమర్థత మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. 114 కిలోల బరువుండే స్కార్పియాన్ 3, కార్బన్ ఫైబర్ మోనోకోక్ ఫ్రేమ్‌ని కలిగి వుంటుంది. చిన్న చిన్న ప్రాంతాల్లో తేలిగ్గా ఈ బైక్ ల్యాండ్ అవగలదు. గంటకు 96 కిలోమీటర్ల అత్యధిక వేగాన్ని ఇది అందుకుంటుంది. 2020 నాటికి స్కార్పియన్ త్రీ, దుబాయ్ పోలీస్ సర్వీస్‌లోకి చేరనుంది.
తాజా వార్తలు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్