ఇక మానవ యాంకర్లకు గుడ్‌బై...

- November 09, 2018 , by Maagulf
ఇక మానవ యాంకర్లకు గుడ్‌బై...

మానవ మేధస్సు దూసుకుపోతుంది కాదు..కాదు.. చైనీయులు దూసుకుపోతున్నారు. ఎంతలా అంటే మనిషి ప్రతిరూపాన్ని మనిషే సృష్టించుకునేంతలా. తాజాగా చైనా ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. కృతిమ మేధస్సు కు కూడిన న్యూస్ యాంకర్‌ను సృష్టించింది. వాస్తవిక యాంకర్ ఎలాంటి ప్రతిస్పందనలు కలిగి ఉంటారో అలాంటి వాయిస్, ముఖ కవళికలతో కూడిన ఓ ఆర్టిఫిషియల్ మేల్ యాంకర్‌ను క్రియేట్ చేశారు. వార్తలు చదివే విధానంలో ప్రొఫెషనల్ యాంకర్ ఎలాంటి ధ్వని హెచ్చుతగ్గులను కలిగి ఉంటుందో అలాంటి మాడ్యులేషన్ తో ఆర్టిఫిషియల్ యాంకర్‌ను రూపొందించారు. ఇది ప్రపంచంలోనే మొట్టమెుదటి కృతిమ మేధస్సు కలిగిన వార్తా వ్యాఖ్యాత కావడం విశేషం. చైనాకు చెందిన చైనీస్ సెర్చ్ ఇంజన్ కంపెనీ సోగోకు ఈ యాంకర్‌ను క్రియేట్ చేసినట్లు చైనా న జిన్హువా తన కథనంలో పేర్కొంది.చైనాలో జరుగుతున్న ఐదవ ప్రపంచ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్‌లో కృత్రిమ మేధతో కూడిన రెండు రోబోలను ఆవిష్కరించారు. ఈ ప్రదర్శనలో రోబొలు ఆంగ్ల,మాండరిన్ భాషల్లో వార్తలను చదివాయి. వార్తలను రూపొందించడంలో వ్యయ, ప్రయాసలు ఈ రోబోలు తగ్గిస్తాయని, 24గంటలు పనిచేపే సామర్థ్యం వీటిలో ఉన్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. చౌకగా, విశ్వసనీయంగా, నమ్మకమైన సమగ్ర కృత్రిమ మేధస్సు (ఏఐ) నిర్మాణం కోసం ఇవి కృషి చేస్తాయని, కృతిమ మేధస్సు పెంపొందించే క్రమంలో ఇలాంటి పరిశోధనలు మరిన్ని అద్భుత ఆవిష్కరణలకు నాంది అని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అభివర్ణించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com