కాలు లేదు, అయినా ఫిట్‌నెస్‌పై ఇష్టం తగ్గలేదు
- November 10, 2018
అబుదాబీ:పాలస్తీనా జాతీయుడు, అబుదాబీ రెసిడెంట్ అయిన 33 ఏళ్ళ తారెక్ అల్ సక్కా, 2012లో జరిగిన ఓ ప్రమాదంలో కాలుని కోల్పోయాడు. ఆ ఘటన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందంటాడు తారెక్. జీవితం విలువ ఏంటో తనకు ఆ ఘటనతో తెలిసిందని చెబుతున్న తారెక్, అప్పటినుంచి ఫిట్‌నెస్‌పై అవగాహనను పెంచుకున్నాడు. 30 రోజుల దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేసిన తారెఖ్, దీన్నొక అద్భుతమైన అవకాశంగా మలచుకుంటున్నట్లు చెప్పాడు. ఓ కాలు లేకపోయినా, ఫిట్‌నెస్‌పై తనకు ఇష్టం పెరిగిందే తప్ప, తగ్గలేదని నిరూపిస్తూ కష్టతరమైన కసరత్తుల్నీ సులువుగా చేయగలుగుతున్నాడు. తారెక్ ఫిట్‌నెస్ కోసం చూపుతున్న శ్రద్ధ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఓ కాలిని రెగ్యులర్ రన్నింగ్ కోసం వినియోగిస్తున్న తాను, స్విమ్మింగ్ కోసం మాత్రం వాటర్ ప్రూఫ్ లెగ్‌ని వినియోగిస్తున్నట్లు తారెక్ చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







