మందు బాబులకు ముందస్తు హెచ్చరిక..
- November 10, 2018
తెలంగాణ:ఆఫీస్ నుంచి అటునుంచి అటే ఫ్రెండ్స్‌తో కబుర్లు, కాలక్షేపం చేసి ఓ చుక్క మందేసి ఇంటికి వచ్చే మగమహారాజులు ఎందరో. ఏంటీ ఇంతలేటైందని ఇల్లాలు ప్రశ్నిస్తే ఆఫీస్‌లో బాస్‌తో అర్జంట్ మీటింగ్, లేదంటే ఎవరికో ప్రమోషన్ వచ్చిందని ఏదో ఒక స్టోరీ రెడీమేడ్‌గా అల్లేస్తుంటారు.
మరి నాలుగు రోజులు మందు దుకాణం బంద్ చేస్తే పరిస్థితి ఏంటి. ఎలక్షన్ల పుణ్యామా అని మద్యం ప్రవహిస్తుంటే పోలింగ్ జరిగే తేదీలకు ముందు రెండు రోజులు పోలింగ్ ముగిసిన తరువాత రెండు రోజులు మొత్తం నాలుగు రోజులు మందు బాబులకు శెలవు ప్రకటించింది ప్రభుత్వం. డిసెంబర్ 7న ఎన్నికలు జరగనుండగా.. 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఈ నేపథ్యంలో 5 వ తేదీ సాయింత్రం 6 గంటల నుంచి 7వ తేదీ సాయింత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అదే విధంగా 11వ తేదీన కూడా షాపులు బంద్ కానున్నాయి. ఎన్నికల ఘట్టాన్ని ప్రశాంతంగా ముగించడానికే ఈ ముందస్తు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







