స్టింగ్ ఆపరేషన్‌లో పట్టుబడ్డ సెక్స్ వర్కర్
- November 10, 2018
దుబాయ్:36 ఏళ్ళ వయసున్న పాకిస్తానీ అకౌంటెంట్‌ని స్టింగ్ ఆపరేషన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్స్ నిమిత్తం పోలీస్ ఇన్‌ఫార్మంట్ నుంచి 2,000 దిర్హామ్‌లు వసూలు చేస్తుండగా ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. ఆగస్ట్ 7న ఈ ఘటన జరిగింది. నైఫ్ ఏరియాలో నిందితురాలు ప్రాస్టిట్యూషన్ చేస్తున్నట్లు సమాచారం అందడంతో, పోలీస్ డిపార్ట్‌మెంట్ అత్యంత చాకచక్యంగా వ్యూహాన్ని రచించి, రెడ్ హ్యాండెడ్‌గా ఆ మహిళను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితురాలు, తాను సెక్స్ కోసం హోటల్‌కి వెళ్ళినట్లు ఒప్పుకోవడం జరిగింది. డబ్బు కోసం సెక్స్‌లో పాల్గొంటున్నట్లు ఆమె అంగీకరించింది. గతంలో పలుమార్లు తాను ఇలా చేసినట్లు కూడా ఆమె పోలీసులకు తెలిపింది. 400 నుంచి 500 దిర్హామ్‌ల మొత్తాన్ని డిమాండ్ చేస్తూ 9 సార్లు ఇలా ఆమె వ్యభిచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో తీర్పు నవంబర్ 26న వెల్లడి కానుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!