దుబాయ్ చేరుకున్న కొత్త మెట్రో రైళ్ళు
- November 10, 2018
దుబాయ్:కొత్త మెట్రో రైళ్ళకు సంబంధించి తొలి దఫాలో 50 రైళ్ళు దుబాయ్ చేరుకున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ వెల్లడించింది. ఈ రైళ్ళను రషిదియా మెట్రో డిపోకి తరలించారు. 2019 అక్టోబర్ నాటికి మొత్తం రైళ్ళన్నీ దుబాయ్‌కి చేరుకుంటాయని ఆర్‌టిఎ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఛైర్మన్, డైరెక్టర్ జనరల్ మట్టర్ అల్ తాయెర్ చెప్పారు. రెడ్ లైన్ రూట్ 2020లో త్వరలో ఈ రైళ్ళను పరీక్షించబోతఱున్నారు. ప్రస్తుతం 643 మంది ప్రయాణీకులకు వీలుగా రైళ్ళ డిజైన్లు వుండగా, కొత్త రైళ్ళలో 696 మంది ప్రయాణీకులకు వీలుంటుంది. ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. కొత్త ట్రైన్లలో చివరి క్యారేజ్ మహిళలు, పిల్లల కోసం వినియోగిస్తారు. ఫస్ట్ క్యారేజ్ గోల్డ్ క్లాస్‌లో వుంటుంది. మిగతా క్యారేజెస్ అన్నీ సిల్వర్ క్లాస్‌గా తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







