బన్నీ ని చుట్టుముట్టిన అభిమానం..
- November 10, 2018
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్య సినిమాలకు కొంత విరామం ఇచ్చాడు. తనను నిరాశకు గురిచేసిన చిత్రం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా నుంచి కోలుకోవడానికి కొంత టైమ్ పట్టింది. తన తరువాతి చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఉండబోతుందని సమాచారం.
టాలీవుడ్‌లోనే కాదు మాలీవుడ్‌లో కూడా బన్నీకి స్టార్ ఇమేజ్ ఉంది. తాజాగా కేరళ ప్రభుత్వం బన్నీని ఆహ్వానించింది. అక్కడ ప్రతి ఏటా జరిగే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్‌ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. నవంబర్ 10 నుంచి నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి బన్నీకేరళకు చేరుకున్నాడు. ఎయిర్ పోర్ట్‌లో అర్జున్‌ని చూసిన అభిమానులు అతడిని చుట్టుముట్టారు. కేరళలో అత్యధిక మార్కెట్ ఉన్న టాలీవుడ్ హీరో అర్జున్ కావడం విశేషం.
అందుకే అర్జున్‌ని చూడగానే అభిమానులు ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. ప్రతి చిత్రంలోనూ ఓ కొత్త లుక్‌లో కనిపించే బన్నీ అంటే యూత్‌లో చాలా క్రేజ్. కేరళకు వెళ్లినప్పుడు కూడా బన్నీ సరికొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించాడు. బన్నీ కొత్త గెటప్ త్రివిక్రమ్ సినిమా కోసమేనని అభిమానులు ఓ అంచనాకు వచ్చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







