న్యూజిలాండ్ పై 34 పరుగులతో భారత్ మహిళా జట్టు సంచలన విజయం
- November 10, 2018
కరీబియన్ ద్వీపాలు వేదికగా ప్రారంభమైన మహిళా టీ-20 ప్రపంచకప్ గ్రూప్ -బీ లీగ్ లో 5వ ర్యాంకర్ భారత్ సంచలన విజయంతో టైటిల్ వేట మొదలుపెట్టింది.
గయానా నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన గ్రూప్ తొలిమ్యాచ్ లో భారత్ 34 పరుగులతో రెండోర్యాంకర్ న్యూజిలాండ్ ను చిత్తు చేసింది.
ఈమ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్.20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగుల భారీ స్కోరు సాధించింది.
భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.51 బాల్స్ లో 7 బౌండ్రీలు, 8 సిక్సర్లతో సుడిగాలి సెంచరీ సాధించింది. యువప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ 45 బాల్స్ లోనే 7 బౌండ్రీలతో 59 పరుగుల స్కోరు నమోదు చేసింది.
సమాధానంగా 195 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన న్యూజిలాండ్.20 ఓవర్లలో 9 వికెట్లకు 160 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







