రేపటి నుంచి తెలంగాణ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
- November 11, 2018
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 19 వరకు నామినేషన్ల దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 22 వరకు ఉంది. కాగా, డిసెంబర్ 7న తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యగా సీటీ పోలీసు కమిషనర్, అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైనప్పటినుంచి నామినేషన్ల ఉపసంహరణ వరకు ఆయా ప్రాంతాల్లో 100 మీటర్ల దూరంలో ఎక్కడా కూడా ఐదుగురు కంటే ఎక్కువ మంది కలిసి తిరగరాదని హెచ్చరించారు. ఎవరైనా ఆదేశాలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీపీ హెచ్చరించారు. మరోవైపు అధికార పార్టీ టీఆర్ఎస్తో పాటు ప్రజాకూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







