చిత్తైన రాఖీసావంత్, ఆసుపత్రిలో అడ్మిట్
- November 11, 2018
రెజ్లింగ్ అంటే వెండితెరపై ఆడిపాడినంత తేలిక కాదనే విషయం బాలీవుడ్ స్పెషల్ బ్యూటీ రాఖీసావంత్‌కి కళ్లకు కట్టినట్టు అర్థమైంది. సీడబ్ల్యుఈ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఫారెన్‌కి చెందిన రోబెల్ అనే వుమెన్ రెజ్లర్ ఓ ఛాలెంజ్ విసిరింది. తనతో పోటీపడే మహిళ పంచకులలో ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చని సవాల్ చేసింది. అక్కడేవున్న రాఖీసావంత్ వెంటనే స్పందించి రింగ్‌లోకి దూకింది.
ఈ క్రమంలో రాఖీ, తనతో ఒక పాటకు డ్యాన్స్ చేయాలని రోబెల్‌కు ఛాలెంజ్ విసిరింది. వెంటనే స్వీకరించిన ఆమె.. డాన్స్ పూర్తి చేసిన వెంటనే రింగ్‌లోవున్న రాఖీని అమాంతం పైకెత్తి గాలిలోకి లేపి కింద పడేసింది. దీంతో గాయాల పాలైంది రాఖీసావంత్. ఈ ఘటన తర్వాత దాదాపు నాలుగైదు నిముషాలు బాధతో విలవిలలాడిపోయింది.
ఐతే, అక్కడున్న ప్రేక్షకులు రాఖీని చూసి సీడబ్ల్యుఈ ఛాంపియన్ షిప్ కార్యకర్త అనుకుని లైట్‌గా తీసుకున్నారు. చివరకు రాఖీ బాధపడటాన్ని గమనించిన నిర్వాహకులు వెంటనే ఆమెని రింగ్ నుంచి బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన చండీగఢ్‌లోని పంచకులలోని తావూదేవి లాల్‌స్టేడియంలో జరిగింది. ప్రస్తుతం రాఖీ.. జీరఖ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటోంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







