యూఏఈ నేషనల్ డే: ఎమిరేట్స్ స్పెషల్ ఫేర్స్
- November 12, 2018
దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్ క్యారియర్ 20 గ్లోబల్ డెస్టినేషన్స్కిగాను స్పెషల్ ఫేర్స్‌ని ప్రకటించింది. యూఏఈ నేషనల్ డే లాంగ్ వీకెండ్ నేపథ్యంలో ఈ ఆఫర్‌ని ప్రకటించడం జరిగింది. నవంబర్ 12 నుంచి నవంబర్ 22 వరకు బుక్ చేసుకున్న ప్రయాణీకులు, జులై 31 వరకు ప్రయాణించేందుకు ఈ స్పెషల్ ఫేర్స్ వర్తిస్తాయి. కొలంబోకి ఎకానమీ క్లాప్ ప్రయాణం కేవలం 1,495 నుంచే ప్రారంభమవుతాయి. లండన్‌కి 2,655 దిర్హామ్‌లకు, కేప్ టౌన్‌కి 3,635 దిర్హామ్‌లకు వెళ్ళేందుకు వీలుంది. బీరట్, మిలాన్ తదితర ప్రాంతాలకూ స్పెషల్ ఫేర్స్ వర్తిస్తాయి. బిజినెస్ క్లాస్ ఫేర్స్ విషయానికొస్తే, కొలంబస్ 3,775 దిర్హామ్‌లకు, కేప్‌టౌన్ 5,835 దిర్హామ్‌లకు, బ్యాంకాక్ 11,205 దిర్హామ్‌లకు టిక్కెట్లు అందుబాటులో వుంటాయి. అదనంగా 725 దిర్హామ్‌లు చెల్లించి ఫైవ్‌స్టార్ హాలిడే ఎక్స్పీరియర్స్ని పొందే వీలు కూడా కల్పిస్తోంది ఎమిరేట్స్. మరిన్ని వివరాలు ఎమిరేట్స్ వెబ్సైట్లో కనుగొనవచ్చు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..