స్పైడర్ మ్యాన్ సృష్టికర్త స్టాన్లీ ఇక లేరు
- November 13, 2018
మీ ఇంట్లో చిన్న పిల్లలున్నారా... వారిని బుజ్జగించాలంటే చందమామ చూపించేవారు కదా... ఇది ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ లాంటి కార్టూన్లు చూపించి వారిని లాలించి తినిపిస్తున్నారు. అయితే అందరికీ స్పైడర్ మ్యాన్ అంటే ఎలా ఉంటాడో తెలుసు.. స్పైడర్ మ్యాన్ సినిమాలు కూడా చూసి ఉంటాం... కానీ ఈ స్పైడర్ మ్యాన్ సృష్టి కర్త ఎవరో చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. స్పైడర్ మ్యాన్ సృష్టికర్త స్టాన్లీ. ఈయన సృష్టించిన ఈ క్యారెక్టర్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్‌తో పాటు ఐరన్ మ్యాన్, హల్క్ లాంటి వాటికి కూడా స్టాన్లీ ప్రాణం పోశారు. వీటన్నిటికీ ప్రాణం పోసిన స్టాన్లీ సోమవారం తుది శ్వాస విడిచారు. మృతి చెందే నాటికి ఆయన వయస్సు 95 ఏళ్లు.
స్టాన్లీ ఒక రచయితగా, ఎడిటర్‌గా మంచి పేరు సంపాదించారు. తాను రాసిన కామిక్ బుక్ టైటన్ 1960వ దశకంలో ఓ సంచలనం సృష్టించింది. జాక్ కిర్బీ, స్టీవ్ డిట్కోలతో కలిసి స్టాన్లీ కొంతమంది సూపర్ హీరోస్‌ను క్రియేట్ చేశాడు. వాటిని కొన్ని తరాలు ఎంజాయ్ చేశాయి.. ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం తన అభిమానులను దృష్టిలో ఉంచుకునే ఎన్నో కొత్త క్యారెక్టర్లు సృష్టించేవారని స్టాన్లీ కూతురు జేసీ లీ తెలిపారు. జీవనం సాగించేందుకు తను చేసే పనిని ఎంతో ఇష్టంగా ప్రేమతో చేసేవారని ఆమె చెప్పారు. స్టాన్లీని కుటుంబం ఎంతగా అయితే ప్రేమించేదో అంతే స్థాయిలో లేదా అంతకంటే ఎక్కవగానే అతని అభిమానులు ప్రేమ చూపేవారని గుర్తు చేశారు. ఆయన మరణం తీరని లోటని స్టాన్లీ కుమార్తె జేసీ లీ చెప్పారు. అయితే స్టాన్లీ మృతికి కారణం మాత్రం ఆమె వెల్లడించలేదు.
ఐరన్ మ్యాన్ స్పైడర్ మ్యాన్‌తో పాటు మరికొన్ని క్యారెక్టర్లకు ప్రాణం పోశారు. స్టాన్లీ ఫీల్డ్‌లోకి రాకముందే అమెరికన్లు సూపర్ హీరోలకు కనెక్ట్ అయిపోయారు. ఎందుకంటే 1938లోనే సూపర్ మ్యాన్ అనే క్యారెక్టర్‌ను ఆవిష్కరించారు. అయితే ఈ సూపర్ హీరోస్‌కు ప్రాణం పోసింది మాత్రం స్టాన్లీ అని చెప్పక తప్పదు. సూపర్ హీరోస్ డిజైనింగ్‌లో సహాయం చేసినప్పటికీ వాటిని ప్రమోట్ చేసే బాధ్యత మాత్రం స్టాన్లీనే తీసుకున్నారు. స్పైడర్ మ్యాన్‌తో పాటు హల్క్, ఎక్స్ మెన్, ఫంటాస్టిక్ ఫోర్, ప్లేబాయ్ ఐరన్ మ్యాన్లను స్టాన్లీ సృష్టించారు.
స్టాన్లీ క్రియేట్ చేసిన దాదాపు అన్ని క్యారెక్టర్లను బేస్ చేసుకుని సినిమాలు వచ్చాయి. ఇవి 21 శతాబ్దం తొలి నాళ్లలో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో ఈ క్యారెక్టర్ ఉన్న సినిమాలు విడుదలై 20బిలియన్ డాలర్ల గ్రాస్‌ను సంపాదించాయంటే ఈ క్యారెక్టర్స్‌కు ఏపాటి క్రేజ్ ఉండేదో ఊహించొచ్చు. ఇక హాలీవుడ్ స్టూడియోలు సూపర్ హీరోస్ పైనే సినిమాలు ఎక్కువగా తీసి విపరీతమైన లాభాలు పొందేవి. దీని ద్వారానే స్టాన్లీ ఆస్తి కూడా విపరీతంగా పెరిగిపోయాయనే టాక్ వచ్చింది. అయితే ఇందులో నిజం లేదని స్టాన్లీ స్పష్టత ఇచ్చారు. 2008లో స్టాన్లీ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం ఆయన్ను ప్రతిష్టాత్మక నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్స్ అవార్డుతో గౌరవించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి