7 డేస్ వాటర్ డైట్ వల్ల పొందే 10 అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

- December 21, 2015 , by Maagulf
7 డేస్ వాటర్ డైట్ వల్ల పొందే 10 అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

బరువు చాలా త్వరగా తగ్గించుకోవాలనుకుంటారు. త్వరగా తగ్గించుకోవాలంటే, ఆరోగ్యకరమైన మార్గంలో ఎలా తగ్గించుకోవాలి?అలా అతి త్వరగా బరువు తగ్గించే మార్గాల్లో ఒకటి వాటర్ డైట్. ఏడు రోజు వాటర్ డైట్ కొన్ని కిలోల బరువును ఆరోగ్యకరంగా తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. బరువు తగ్గించుకోవాలని ఖచ్చితంగా నిర్ధారించుకొనే వారు, వాటర్ డైట్ ను కఠినంగా పాటిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. కఠినంగా వాటర్ డైట్ ను పాలో అయితే, అదనపు కిలోల బరువు తగ్గించుకోవడంతో పాటు, టాక్సిన్స్ ను తొలగిస్తుంది మరియు మరో ముఖ్యమైన విషయం ఇది మిమ్మల్ని ఫిట్ గా ఉంచతుంది. నీళ్లు ఏయే సందర్భాల్లో తాగాలి ? ఎంత పరిమాణంలో తాగాలి ? ఆరోగ్యనిపుణుల అభిప్రాయం ప్రకారం, త్వరగా బరువు తగ్గించుకోవాలనుకొనే వారు వాటర్ డైట్ కంటే మరింత ఎఫెక్టివ్ మార్గం మరోటి ఉండదని నిపుణుల అభిప్రాయం. మీరు వాటర్ డైట్ ఫాలో అవ్వాలనుకున్నప్పుడు కొద్దికొద్దిగా నీళ్ళు మరియుు లిక్విడ్స్(ఫ్రూట్ జ్యూస్)లు తీసుకోవాలి . ఘనపదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. మరి 7 డేస్ వాటర్ డైట్ వల్ల పొందే 10 అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. వాటర్ డైట్లో మొదటి రోజున అనుసరించే వాటర్ డైట్ లో క్యాలరీలు ఉండవు కాబట్టి, ఒక రోజుకు దాదాపు 1పౌడ్ బరువు తగ్గించుకోవచ్చు . ఇది చాలా వేగంగా బరువు తగ్గించుకొనే మార్గం. ఇన్సులిన్ సెన్సివిటిని పెంచడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ లో అవకతవకలను తగ్గిస్తుంది వాటర్ డైట్ వల్ల శరీరంలో డ్యామేజ్ అయిన కణాలు రిపేర్ చేస్తుంది. గాయాలను మాన్పుతుంది మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. వాటర్ డైట్ వల్ల స్ట్రెస్ లెవల్స్ తగ్గుతాయి, బ్లడ్ ప్రెజర్ తగ్గి, బాడీ కాంతివంతంగా ఉంటుంది వాటర్ డైట్ వల్ల సెల్ రెసిస్టెన్స్ మరింత బెటర్ గా ఉండి ఇమ్యూనిటి పెంచుతుంది. వాటర్ డైట్ తో శరీరంలో వివిధ రకాల క్యాన్సర్ సెల్స్ ఏర్పడకుండా నివారిస్తుంది వాటర్ డైట్ వల్ల ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది. రెగ్యులర్ గా వాటర్ ఎక్కువగా త్రాడం వల్ల హార్ట్ డిసీజ్ ల యొక్క ప్రమాధాన్ని తగ్గిస్తుంది జీర్ణసమస్యలు, గ్యాస్ట్రిక్, చీకాకు కలిగించే బౌల్ సిండ్రోమ్, డయోరియా, గ్యాస్, డీహైడ్రేషన్, ఆకలి లేకపోవడం వంటి సమస్యలన్నింటిని నివారిస్తుంది. వాటర్ ఫాస్టింగ్ వల్ల భావోద్వేగాలను మరియు ఆధ్యాత్మిక ఆత్మశోధనకు అవకాశం ఉంటుంది. ఇలాచేయడం వల్ల మనుష్యుల్లో ఆహారం, ఎమోషన్స్ విషయంలో కంట్రోల్ చేసుకొనే శక్తిని ఫాస్టింగ్ సమయంలో అంధిస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com