ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
- November 13, 2018
దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ వర్గాన్ని మచ్చిక చేసుకునే వ్యూహాలు రచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆకట్టుకునే ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఓ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. సాధారణంగా ప్రభుత్వ సంస్థల్లో కానీ ప్రయివేటు సంస్థల్లో కానీ పని చేసే ఉద్యోగులకు ప్రతి ఐదేళ్లకొకసారి నిర్దేశిత భత్యాన్ని గ్రాట్యుటీగా పొందే అవకాశం ఉండేది ఇప్పటి వరకు.
అయితే ఈ అవకాశం సంస్థలు ఉద్యోగులందరికీ కల్పించడం లేదన్నది వాస్తవం. సుదీర్ఘకాలం సర్వీసులో ఉన్నవారికి మాత్రమే లబ్ది చేకూరుతున్నదని ఉద్యోగ సంఘాలనుంచి నిరసన వ్యక్తమవుతోంది. అయితే ఇదే అవకాశంగా భావించిన మోదీ సర్కార్.. గ్రాట్యుటీ పీరియడ్‌ని మూడేళ్లకు కుదించేలా.. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ-1972 చట్టాన్ని సవరించడానికి ప్రయత్నిస్తోంది. కాంట్రాక్ట్ బేస్‌లో తీసుకున్న ఉద్యోగులకు కూడా ఈ తాజా సడలింపు వర్తించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పారిశ్రామిక వర్గాల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తోంది లేబర్ మినిస్ట్రీ. డిసెంబర్ నెలాఖరుకు ఈ నిర్ణయం పట్ల స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







