యూఏఈ విడిచి పెడితే, 6 నెలల వీసా చెల్లదు
- November 13, 2018
ప్రస్తుతం నడుస్తోన్న అమ్నెస్టీ స్కీమ్ ద్వారా ఆరు నెలల వీసా పొందినవారు, యూఏఈ విడిచి వెళితే ఆ వీసా ఆ తర్వాత చెల్లుబాటు కాదని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ నేషనాలిటీ పేర్కొంది. రెసిడెన్స్ వీసాతో పోల్చితే, ఆరు నెలల వీసాకి ఎలాంటి హక్కులూ వుండవు. ఆరు నెలల సమయంలో ఉద్యోగం చూసుకోగలిగితే తప్ప, ఈ వీసాతో అదనపు ప్రయోజనాలు ఏమీ వుండవని అధికారులు పేర్కొన్నారు. ఈ వీసా మల్టిపుల్ ఎంట్రీకి పనికిరాదని ఎఫ్‌ఎఐసి అధికారి ఒకరు స్పష్టతనిచ్చారు. 600 దిర్హామ్‌లకు ఆరు నెలల తాత్కాలిక వీసా, అమ్నెస్టీ పొందగోరేవారికి లభిస్తుంది. తమ పెండింగ్ ఫైన్స్‌ని క్లియర్ చేసుకున్నవారికే ఈ వీసా వెసులుబాటు లభిస్తుంది. ఆరు నెలల్లో ఉద్యోగం వెతుక్కోగలిగేవారికే ఈ టెంపరరీ వీసా ఉపయోగపడ్తుందనీ, లేని పక్షంలో దేశం విడిచి వెళ్ళాల్సి వుంటుందనీ, ఓ సారి దేశం విడిచి వెళితే వీసా మళ్ళీ పనిచేయదని ఎఫ్‌ఎఐసి డైరెక్టర్ ఆఫ్ రెసిడెన్స్ ఎఫైర్స్ బ్రిగేడియర్ సయీద్ రక్యాన్ అల్ రషీద్ చెప్పారు. టెంపరరీ వీసాతో ఎలాంటి పనీ చేయడానికి వీల్లేదు. ఉద్యోగం పొందిన తర్వాత, ఎంప్లాయ్‌మెంట్ వీసా పొందిన తర్వాతే వర్క్ చేయడానికి వీరు అర్హులు. అమ్నెస్టీ స్కీమ్ నవంబర్ 30వ తేదీతో ముగుస్తుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







