టాయ్‌లెట్‌లో వీడియో: క్లీనర్‌కి మూడు నెలల జైలు
- November 13, 2018
దుబాయ్: మహిళల టాయిలెట్‌లో ఫోన్‌ని వుంచి, దాన్ని వీడియో మోడ్‌లో పెట్టిన క్లీనర్‌కి మూడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితుడు 27 ఏళ్ళ వయసున్న వ్యక్తి.. భారతదేశానికి చెందిన నిందితుడు, దుబాయ్ మెట్రో స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. మహిళలు వినియోగించే టాయిలెట్స్‌లో మొబైల్ ఫోన్ వుంచడం, ద్వారా అసభ్యకర రీతిలో మహిళల్ని ఫోన్‌లో చిత్రీకరించాలన్న నిందితుడి ఆలోచనను న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. అయితే విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించలేదు. తన ఫోన్‌ని టాయిలెట్‌లో పొరపాటున మర్చిపోయానని పేర్కొన్నాడు. బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్‌లో జూన్ 30న ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదయ్యింది. టాంజానియాకి చెందిన రిసెప్షనిస్ట్, టాయిలెట్‌లో మొబైల్ ఫోన్‌ని గుర్తించి, పోలీసులకు పిర్యాదు చేశారు. కాగా, రెండు సార్లు తాను ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







