అమెరికా:భీకరమైన మంటలు.. 42 మంది మృతి..
- November 13, 2018
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో ఏర్పడిన కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. భీకరమైన మంటల కారణంగా ఇప్పటివరకు 42 మంది మరణించారు. వందలాదామంది గాయపడ్డారు. అయితే కాలిఫోర్నియా చరిత్రలోనే ఈ ప్రమాదం అతిపెద్దదని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 6వేల 5వందల నివాస ప్రాంతాలు బుగ్గిపాలయ్యాయి. దాదాపు 90వేల ఎకరాల భూమి కాలిబూడిదైంది.
మంటలను అదుపుచేసేందుకు 8వేల మంది నిరంతరం ప్రయత్నిస్తున్నారు. మంటల్లో తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బాధితుల వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 50వేల నివాస ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉందని, దాదాపు రెండులక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఎగిసిపడుతున్న మంటల కారణంగా ఎక్కడ చూసినా భయానక వాతావరణమే కనిపిస్తోంది. ఈ ప్రమాదంలో మిలియన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







