వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు
- November 13, 2018
వైట్ హౌస్: వాణిజ్య పరమైన సంబంధాలను తమకు లాభదాయకంగా మార్చుకోవడంలో ఇండియా అత్యుత్తమ పనితీరు కనబరుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. వైట్ హౌస్ లో భారత అమెరికన్లతో కలసి దీపావళి వేడుకలు జరుపుకున్న ఆయన, ప్రధాని నరేంద్ర మోడీతో తన స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. "ఇండియా, అమెరికాల మధ్య బలమైన సంబంధాలున్నాయి. మోడీ నాకు స్నేహితుడు కావడం ఎంతో సంతోషాన్ని గలిగిస్తోంది. ఇండియాతో మరింత ధృడమైన సంబంధాల కోసం కృషి చేస్తున్నాం. అయితే, వారు బేరం చేయడంలో సిద్ధహస్తులు. ఇంకా చెప్పాలంటే, ట్రేడ్ డీల్స్ ను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బెస్ట్" అని అన్నారు. ఆపై వైట్ హౌస్ లోని రోస్ వెల్ట్ రూమ్ లో దీపాలను వెలిగించిన ట్రంప్, వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టాప్ ఇండియన్ అమెరికన్స్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి