ఒక్కొక్కటిగా బయటికొస్తున్న కౌశల్ బ్లఫ్ వేషాలు..
- November 13, 2018
బిగ్ బాస్ టూ విన్నర్ కౌశల్ బ్లఫ్ వేషాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బిగ్ బాస్ షో విజేతగా నిలిచిన తర్వాత ఒక్కసారిగా సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకున్న కౌషల్ అదే కిక్కులో బాలెన్స్ ఔటైపోయాడు. విజేతగా నిలిచిన తనకు ఏకంగా పీఎంవో నుంచి మేసేజ్ వచ్చిదంటూ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దిమ్మతిరిగే బెలూన్లు పేల్చాడు. అంతేకాదు..బిగ్ బాస్ టూ సీజన్ లో తనకు 40 కోట్ల ఓట్లు వచ్చాయని..అంత పెద్ద సంఖ్యలో ఓట్లు రావటంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వాల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు తనను అప్రోచ్ అయ్యారంటూ మరో షాకిచ్చాడు కౌశల్. కానీ, అతను చెప్పినవి అన్ని అబద్దాలేని ఇప్పుడు సాక్షాధారాలతో సహా తేలిపోయాయి.
ఓ రీజినల్ ఛానెల్ లో వచ్చే బిగ్ బాస్ టూ విన్నర్ దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంటుందా? ఉన్నా అది ప్రధాని కార్యాలయం కూడా స్పందించే రేంజ్ లో ఉంటుందా? ఇదే అనుమానం అప్పట్లో అందరికీ వచ్చింది. కౌశల్ తీరుకు చిర్రెత్తిపోయిన నెటిజన్లు అతని బ్లఫ్ డైలాగ్స్ ను తమ ట్రాలింగ్ తో కడిగిపారేశారు. ఓ వ్యక్తి మాత్రం ఇందులో నిజానిజాలేంటో తెల్సుకునేందుకు ఆర్టీఏ యాక్ట్ ద్వారా పీఎంవో నుంచి వివరాలు సేకరించాడు. గత అక్టోబర్ మొదటి వారంలో బిగ్ బాస్ టూ టైటిల్ విన్నర్ కు మీ నుంచి ఏమైన మేసేజ్ వెళ్లిందా అని ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన పీఎంవో తాము అలాంటి ప్రోగ్రాంకు కాంగ్రాట్స్ మేసేజ్ పంపలేదని తేల్చి చెప్పేసింది.
పీఎంవో నుంచి కౌశల్ కు కంగ్రాట్స్ మేసేజ్ పరమ అబద్ధం అని తేలిపోయింది. ఇక గిన్నిస్ బుక్ ఆఫ్ వాల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు అప్రోచ్ అవటం మాటేమిటి? సాధారణంగా గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఒక ఈవెంట్ రికార్డ్ ను కవర్ చేయాలంటే ముందుగా మనమే వాళ్లకు ఇన్ఫాం చేయాలి. వాళ్ల సమక్షంలో గత రికార్డులను బ్రేక్ చేటయంగానీ, కొత్త రికార్డులను క్రియేట్ చేయటంగానీ జరుగుతుంది. కానీ..కౌశల్ మాత్రం గిన్నిస్ వాళ్లే అతనికి పోలైన ఓట్లు తెల్సుకొని ఫిదా అయి గిన్నిస్ బుక్ వాళ్లే వచ్చిన తనను కలిసారని చెప్పటం అతని విపరీత ఆలోచన తీరును జనానికి తెలిసేలా చేసింది.
సీజన్ టూ లో డిఫరెంట్ పర్సనాలిటీగా పేరున్న కౌశల్..తొలి రోజుల్లో ఫైటింగ్ స్పిరిట్ కొద్ది మందిని ఫ్యాన్స్ గా మారింది. తనను కార్నర్ చేస్తున్నారంటూ ఆడియన్స్ కు మేసేజ్ ఇవ్వటంలో సక్సెస్ అయ్యాడు. కానీ, విన్నర్ గా నిలిచిన తర్వాత వింత చేష్టలతో జనంలో పలుచనైపోయాడు. తనను తాను ఎక్కువగా ఊహించుకొని నెటిజన్లకు స్టఫ్ అయ్యాడు కౌశల్. అయినా..ఎఎంవో ఆఫీస్ అనగానే కొందరికీ ఏదో మూల సంశయం ఉండేది. కానీ, పీఎంవో ఇచ్చిన సమాధానంతో కౌశలో పెద్ద బిగ్ బాస్ కాదు..బ్లఫ్ బాస్ అని తేలిపోయింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి