తమన్నా, సందీప్.. ‘నెక్ట్స్ ఏంటి’ సినిమా...
- November 14, 2018
యూత్ లో తమన్నా గ్లామర్ కున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే యువ హీరోల్లో మంచి సక్సెస్ చిత్రాల్లో నటించిన సందీప్ కిషన్.. నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తున్న మూవీ ‘నెక్ట్స్ ఏంటి’.
ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి ఓ బాలీవుడ్ డైరెక్టర్ తెలుగు సినిమా కి దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ‘ఫనా’, ‘హమ్ తుమ్’ చిత్రాల దర్శకుడు కునాల్ కోహ్లి ఈ మూవీకి దర్శకత్వంలో వహిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నవదీప్, పూనమ్ కౌర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
కథకళి, కిల్లింగ్ వీరప్పన్ వంటి చిత్రాల్ని గ్రాండ్ గా రిలీజ్ చేసిన నిర్మాత గౌరీ కృష్ణ.. ఈ క్రేజీ ప్రాజెక్టు తెలుగు హక్కుల్ని దక్కించుకున్నారు. ‘నెక్ట్స్ ఏంటి’ మూవీని డిసెంబర్ ప్రథమార్థంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు శ్రీ కృష్ణ క్రియేషన్స్ అధినేత గౌరి కృష్ణ.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







