ఇస్రో బాహుబలి ప్రయోగం విజయవంతం
- November 14, 2018
ఇస్రో బాహుబలి ప్రయోగం విజయవంతమైంది. సమాచార వ్యవస్థకు ఊతమిచ్చే జీశాట్-29 భారీ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్వీ-మార్క్3 డీ2 రాకెట్ రోదసిలోకి తీసుకువెళ్లింది. రాకెట్ బరువు 640 టన్నులు కాగా, ఉపగ్రహం బరువు 3,423 కిలోలు. శ్రీహరికోట షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈ రాకెట్‌ను నింగిలోకి పంపారు శాస్త్ర వేత్తలు. 16.43 నిమిషాలలో భూమికి 207కి.మీ. ఎత్తుకు చేరుకుని జీశాట్-29 ఉపగ్రహాన్ని వదిలిపెట్టింది రాకెట్. దీంతో ఈ ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు తెలిపారు.
కాగా ఈ ఉపగ్రహం.. జమ్ము-కశ్మీర్, ఉత్తర, ఈశాన్య భారత భూ భాగాలలో సేవలు అందించనుంది. కశ్మీర్ లోయలో ఇంటర్నెట్ ప్రసారాలకు ఊతం ఇస్తుంది. మొత్తం పదేళ్లపాటు ఈ ఉపగ్రహం పనిచేసేలా రూపొందించారు శాస్త్రవేత్తలు. బెంగుళూరులోని ఇస్రో శాటిలైట్ సెంటర్, అహ్మదాబాదులోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ సంయుక్తంగా ఉపగ్రహాన్ని రూపొందించాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







