పెళ్లికి ఇన్సూరెన్స్ చేయించిన దీపికా, రణ్వీర్
- November 15, 2018
ఢిల్లీ : ఎవరైనా వారి జీవితాలకు, వాహనాలకు ఇన్సూరెన్స్ చేయిస్తారు..కానీ బాలీవుడ్ ప్రేమజంట రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె తమ వివాహానికి ఇన్సూరెన్స్ చేయించారు. ఢిల్లీకి చెందిన ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో వీరిద్దరూ తమ పెళ్లికి ఇన్సూరెన్స్ చేయించారట. 'దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ భవ్నానీ' పేరిట దీప్‌వీర్ వివాహానికి బీమా చేయించారు. దీనికి సంబంధించిన పత్రాలను కూడా వివాహం సందర్భంగా వీరికి అందించారు. వివాహంలో ప్రమాదవశాత్తూ ఆస్తి నష్టం, దొంగతనం, పేలుడు, అగ్ని ప్రమాదం, ఎయిర్ క్రాప్ట్ ప్రమాదం, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది' అని ఈ సంస్థ వెల్లడించింది. ఇటలీలోని లేక్ కోమోలో రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణెల వివాహం కొంకణి సంప్రదాయంలో అట్టహాసంగా జరిగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పెళ్లి తంతు మధ్యాహ్నం 3 గంటలకు ముగిసినట్లు తెలుస్తోంది. అయితే వివాహ వేడుకలో సెల్‌ఫోన్లను నిషేధించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







